Feb 12,2023 00:15

గ్రామంలో పర్యటిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మడిగా గ్రామాల్లో పర్యటించి వైసీపీ ప్రభుత్వం తీరును దుయ్యబడుతూ ప్రచారం సాగిస్తున్నారు. పాడేరు మండలం గొండెలి గ్రామంలో ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. నియోజక వర్గంలోని టిడిపి ముఖ్య నాయకులంతా కలిసికట్టుగా గ్రామాల్లో పర్యటిస్తున్న తీరు ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్యరాస మణికుమారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్‌ యంవివి ప్రసాద్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ వంజంగి కాంతమ్మ, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, నాయకులు కిముడు నారాయణ నాయుడు, రామలింగం నాయుడు పాల్గొన్నారు.