Sep 24,2023 21:46

ఘనంగా ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ రాజానరేంద్రకుమార్‌ ప్రమాణ స్వీకారం
వైసిపిలో ప్రతిఒక్కరికీ సముచిత స్థానం : ఎంపిపి చంటిరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు

            మండలంలోని గొల్లలకోడెరులో వైసిపి సంబరాలు అంబరాన్ని అంటాయి. డిజె సౌండ్లు, బాణసంచా కాల్పులు, కోలాహలం, ఆనందోత్సవాల మధ్య ఉండి ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ చేకూరి రాజానరేంద్ర కుమార్‌ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గొల్లలకోడేరులో నరేంద్ర కుమార్‌ స్వగృహం నుంచి ఉండి మార్కెట్‌ యార్డ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పాలకోడేరు ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు), సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, బొల్లా శ్రీనివాస్‌, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు నరేంద్ర కుమార్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిపి చంటిరాజు మాట్లాడుతూ నరేంద్రకుమార్‌కు పదవి దక్కడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. నరేంద్రకుమార్‌ నిస్వార్థ నాయకుడని అభినందించారు. వైసిపిలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ నరేంద్రకుమారే నిదర్శమని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ఎంపిపి ఆదాడ లక్ష్మీతులసి, సర్పంచులు కడలి నాగేశ్వరి, చింతపల్లి చిన్న, కడలి విజయలక్ష్మి, ఇంజేటి మరియమ్మ, వైసిపి నాయకులు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు, వెంకటరాజు, చెల్లబోయిన పాపారావు, పాల రాధాకృష్ణ, బొక్క రాంబాబు, హనుమంతరావు, గడ్డం జోషి, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
నిస్వార్థంగా సేవ చేస్తా
ఉండి ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ రాజానరేంద్రకుమార్‌
తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిస్వార్థంగా సేవ చేస్తానని ఉండి ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ రాజానరేంద్రకుమార్‌ అన్నారు. పదవి కేటాయించిన వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌ నరసింహరాజుకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తనపై అభిమానం చూపిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా తన రాజకీయ జీవితంలో గ్రామస్తులు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి, గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
క్రిస్టియన్‌ పేటల ఆధ్వర్యంలో సంబరాలు
నరేంద్రకుమార్‌ ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా క్రిస్టియన్‌ పేటల ప్రాంత ప్రజల ఆధ్వర్యంలో గొల్లలకోడేరు మెయిన్‌ సెంటర్‌లో సంబరాలు చేశారు. నరేంద్రకుమార్‌కు బాణసంచా కాల్పులతో స్వాగతం పలికి క్రిస్టియన్‌పేట పెద్దలు, యూత్‌, మహిళలు పుష్ప మాలలు, పుష్ప గుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. మెయిన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను నరేంద్ర కుమార్‌ కట్‌ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు జీవితంలో మర్చిపోలేనన్నారు. క్రిస్టియన్‌పేట వాసులు మాట్లాడుతూ నరేంద్రకుమార్‌ ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ పదవి రావడం అభినందనీయమని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జివి.నరసింహరావు, బాబూరావు, సొలోమోను, సాల్మన్‌, చంద్రశేఖర్‌, రాజశేఖర్‌, సత్యనారాయణ, గాంధీ, పవన్‌, దీపు, నరేష్‌, రవి, వెంకటరాజు, బన్ను పాల్గొన్నారు.