Jun 17,2023 15:19

ప్రజాశక్తి-పాకాల : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హ్యూమన్ రైట్స్ యూత్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులుగా పాకాలకు చెందిన కే గంగయ్య నియమితులయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇరంగారపల్లి పంచాయతీ, అడుసుపల్లి గ్రామం, పాకాల మండలానికి చెందిన ఏఐసిసి హ్యూమన్ రైట్స్ యూత్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు కే గంగయ్య మాట్లాడుతూ ఏఐసిసి హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ వరేందర్ కుమార్ పాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రెసిడెంట్ పి చంద్రయ్య సహకారంతో ఏఐసిసి హ్యూమన్ రైట్స్ లో జిల్లా ఉపాధ్యక్షులుగా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షులుగా బాధితులు అప్పగించిన నేషనల్ ప్రెసిడెంట్ వరేందర్ కుమార్ పాల్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ పి చంద్రయ్యకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వారి పని వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే అవినీతి రహిత సమాజం మరియు సమాజ అభివృద్ధిని చూడవచ్చని అన్నారు. ఈ సందర్భంగా సమాజ సేవ చేయడానికి ఏఐసిసి హ్యూమన్ రైట్స్ లో జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నిక అవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న నా పరిధిలో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా నా వంతు నేను కృషి చేస్తానని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు జరిగే అన్యాయాలను అరికట్టి వారికి అండగా ఉంటామని అన్నారు.ఏ మనిషికి అయినా మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు ఏఐసీసీ హ్యూమన్ రైట్స్ అండగా ఉంటుందని అన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు 8309518712 ఈ నెంబర్కు సంప్రదించవచ్చని, వారికి అండగా ఉంటామని తెలిపారు.