- దాదాపు 2250 విగ్రహాల నిమజ్జనం .
- నిర్విరామంగా శ్రమించిన గణేష్ మహోత్సవ సమితి నాయకులు.
ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : వినాయక నిమజ్జనం మంగళవారం అంగరంగవైభవంగా ప్రారంభం అయింది.నగరంలో 2 వేల విగ్రహాల దాకా ఉంటాయని అంచనా వేసిన వాస్తవిక లెక్కల్లో 2250 విగ్రహాల దాకా నిమజ్జనం జరిగినట్టు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు కగ్గోలు హరీష్ బాబు, కాలింగి నరసింహ వర్మలు తెలిపారు. మంగళవారం మొదలయిన నిమజ్జనం బుధవారం 11 గంటల దాకా ప్రధాన ఘాట్ లో నిమజ్జనం నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం జరగడంతో ప్రధాన ఘాట్ లో విగ్రహాలు అన్ని కూడా కుప్పలుగా మిగిలాయి.నీటి ప్రవాహం ఎక్కువగా లేకపోవడం, అన్ని విగ్రహాలు ప్రధాన ఘాట్ లో నిమజ్జనం చేయడం వల్ల చాలా విగ్రహాలు పైన మిగిలిపోయాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం నిర్విరామంగా గణేష్ ఉత్సవ సమితి నాయకులు మంగళవారం నుండి బుధవారం వరకు విగ్రహాలు అన్ని పూర్తిగా నిమజ్జనం జరిగేదాక ఘాట్ లో ఉంటూ విగ్రహ నిర్వహికులకు సూచనలు ఇస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










