వేషభాషలు వేరైనా
కులమతాలెన్నున్నా
సహనమే సంస్కారంగా
అహింసాపథమే ఆలంబనగా
త్యాగధనుల స్ఫూర్తితో
సంకల్పాల ఛత్రఛాయలో
లౌకికవాదం
స్వతంత్ర న్యాయం
స్వేచ్ఛా ఎన్నికలు
వాక్, పత్రికా స్వేచ్ఛ
పంచ ప్రాణాలుగా
ప్రజాస్వామ్యం ఆత్మగా
రాజ్యాంగం మార్గదర్శిగా
సౌరతేజంతో విరాజిల్లుతూ
డెబ్భైమూడో పడిలోకి
ప్రవేశించిన
గణతంత్ర భారతమా
నీకు వందనం
పాదాభివందనం
వేమూరి శ్రీనివాస్
99121 28967