
ప్రజాశక్తి - యద్దనపూడి
మండలనలోని గన్నవరం గ్రామంలో మన పల్లెకు మన ఏలూరి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మొదట ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు నల్లకుంటను పరిశీలించారు. ఆకుంటలోని నీటితో సాగు చేసిన మిర్చి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గ్రామంలోని సాయిబాబ గుడిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు తప్పు అని ఒక్క రైతు చెప్పినా తాను ముక్కు నేలకు రాస్తానని అన్నారు. వైసిపి అధికారానికి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు తప్పలేదన్నారు. వ్యవసాయం చేసుకునే వీలు లేకుండా పోయిందన్నారు. ముందు చూపులేని కారణంగానే సాగునీటి సమస్య ఎదరైందని అన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.