Nov 08,2022 23:11

విద్యార్థులతో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి

ప్రజాశక్తి -హుకుంపేట : స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న గణితం, ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జెడ్‌పిటిసి రేగం మత్స్యలింగం కోరారు. మంగళవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సబ్జెక్టుల టీచర్లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతన సమస్యలను విద్యార్థులు వివరించారు.
ఈ సందర్భంగా మత్స్యలింగం మాట్లాడుతూ, పాఠశాలలో 440 మంది విద్యార్థులు ఉన్నారని, వారంతా ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్న నేపథ్యంలో ప్రధానమైన గణితం, పిఎస్‌ సబ్జెక్టులకు టీచర్లు లేకుంటే వారికి సరైన, నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, తరగతి గదులు, ఇతర మౌలిక సౌకర్యాల కొరతపై జిల్లా కలెక్టర్‌ ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ఐటిడిఎ, గిరిజన సంక్షేమ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడమంటే, వారి భవిష్యత్‌తో ఆడుకోవడమేనని, వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లంబన్న ఉన్నారు