May 17,2023 22:15

ఎంఎస్‌ఎన్‌ వేసవి శిబిరంలో గణితం,డ్రాయింగ్‌పై శిక్షణను ఇస్తున్న ఉపాధ్యాయులు రవిశంకర్‌,

- ఉత్సాహంగా వేసవి వినోదం
ప్రజాశక్తి - కాకినాడ
ప్రతి విద్యార్థికి గణితం భవిష్యత్‌కు దిక్సూచి అనిప్రముఖ గణిత అవధాని, పాఠ్యపుస్తక రచయిత పి. రవిశంకర్‌ విద్యార్థులకు సూచించారు. స్థానిక జగన్నాధపురం ఎంఎస్‌ఎన్‌ చారిటిస్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల నందు వి.బి.వి.ఆర్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్యర్యంలో వేసవి వినోదం కన్వీనర్‌ కేసరి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న రెండవ రోజు ఉత్సాహభరితంగా జరిగింది. ఈసందర్భంగా రిసోర్స్‌ పర్సన్‌గా రవిశంకర్‌ గణితంలో అనేక పజిల్స్‌, టిప్స్‌ నేర్పించారు. డ్రాయింగ్‌ మాష్టర్‌ ఎం.చిన్నబాబు పిల్లలకు బొమ్మలు వేయడంలోని మెళకువలు తెలుపుతూ కర్టెన్స్‌పై బొమ్మలువేయడం నేర్పించారు. పెద్దాపురం స్థానిక వరహాలయ్య పేటలోని యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి వినోదం శిబిరంలో విశాఖ స్పోర్ట్స్‌ కరాటే ఉపాధ్యక్షులు, బిఎస్‌బికే సౌత్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి మల్లా సుధాకర్‌ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన విద్యార్థులు పలు కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కరాటే టీచర్‌ దుంగల పూజితా సూర్యశ్రీ, రొంగల అరుణ్‌ కూనిరెడ్డి అరుణ, రవికుమార్‌, అమృత, నమ్రత, మంజుల, జ్యోత్స్న డి.కృష్ణ పాల్గొన్నారు. పెద్దాపరం శాఖా గ్రంథాలయంలో 10వ రోజు వానపల్లి లచ్చిబాబు బాలలకు పద్మాసనం, వజ్రాసనం తదితర యోగాసనాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వాటి ద్వారా లభించే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని వివరించారు. గ్రంథాల యాధికారి పాలంకి నాగరాజు, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ మండలం వేట్లపాలెం శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు కథలు చెప్పడం, కథలు చదవడం, డ్రాయింగ్‌, తదితర అంశంలో శిక్షణ ఇచ్చారు. జూన్‌ 11వ తేదీ వరకు నిర్వహించుచున్న వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు వారు శిక్షణ పొందిన అంశాల నుండి పోటీలు నిర్వహించి బహుమతి అందజేయనున్నట్లు గ్రంథాలయ అధికారి పెదిరెడ్ల విమలాదేవి చెప్పారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శాఖా గ్రంధాలయం అధికారి టి.నళిని,ఉపాధ్యాయిని ఎస్‌.లోహిత ఆధ్వర్యంలో విద్యార్థులకు జనరల్‌ మాథ్స్‌పై సుమారు 28 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు.