Sep 08,2023 21:48

శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరురామరాజు

 కడప : శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో వినాయక ఉత్సవాలను విజయ వంతంగా నిర్వహించేందుకు శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు తెలిపారు. జిల్లాలో గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం కలెక్టరే ట్‌లోని స్పందన హాల్‌ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ తోపాటు జెసి జి.గణేష్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌, ఎఎస్‌పి తుషార్‌ డూడి, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డిఆర్వో గంగాధర్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో గణేశ చతుర్థి ఉత్స వాలను నిర్వహించుకోవాలని చెప్పారు. అందు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ందరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కమిటీలు ముందుకు వస్తే నామినల్‌ రుసుం తో అనుమతులు ఇస్తామని చెప్పారు. సింగల్‌ విండో పద్దతిలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల ప్రజల సహకారంతో గణేష్‌ ఉత్సవాలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు. నిమజ్జనం మార్గంలో కరెంట్‌ తీగలు, కేబుల్‌ వైర్లుఅడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో క్రేన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అలాగే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. వినాయక ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్‌ శాఖ ఇచ్చే సూచనలను తప్పక పాటిం చాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, శాంతి భద్రతలకు, మతసామరస్యానికి ఇబ్బంది కలగ కుండా వినాయక ఉత్సవాలు నిర్వహిం చాలన్నారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు సంబ ంధించి ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను ఉత్సవ కమిటీ సభ్యులు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని శాంతి కమిటీ సభ్యులను ఆయన కోరారు. సందర్భంగా గణేష్‌ ఉత్సవాల నిర్వ హణలో శాంతి భద్రతల ఏర్పాట్లపై పలువురు శాంతి కమిటీ సభ్యులు చెప్పిన తమ అభిప్రా యాలను కలెక్టర్‌ స్వీకరించారు. సమావేశంలో కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు ధర్మాచంద్రా రెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, వెంకటేశ్వర్లు, శాంతి కమిటీ సభ్యులు లక్ష్మణ్‌ రావు, లక్ష్మినాథ్‌ రెడ్డి, బాలకష్ణ, రామ్‌ మహేష్‌, సతీష్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.