
ప్రజాశక్తి - బి.కొత్తకోట(రాయచోటి) : మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బి.కొత్తకోట నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం కమిషనర్ పి.ఆర్ మనోహర్ ఆదేశాలలో మేరకు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నగర పంచాయతీ అకౌంట్ ఆఫీసర్ బి.రమాదేవి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారని సత్యం,అహింస అనే వాటిని ఆయుధాలుగా మలచుకొని ఆంగ్లేయులపై పోరాటం కొనసాగించారన్నారు.తద్వారా భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టాడన్నారు.భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ పోరాటానికి గాను పలువురు నాయకులు మహాత్మ,జాతిపిత,బాపూజీ వంటి బిరుదులతో గౌరవించారన్నారు.గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.