Oct 23,2022 22:32

ప్రజాశక్తి- గంపలగూడెం 

స్థానిక తోటమూలలో అనుమతి ద్వారా ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను ఆదివారం సాయంత్రం డీసీపీ మేరీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.షాపు యజమానులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలతో చెలగాటమని హెచ్చరిం చారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడకుండా ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించాలని గంపలగూడెం ఎస్సై సతీష్‌ కుమార్‌.ను ఆదేశించారు.కాగా శనివారం విజయవాడ జింఖానా గ్రౌండ్లో టపాసుల అగ్ని ప్రమాదంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయిన సంఘటనను పురస్కరించుకొని మేరీ ప్రశాంతి సుడిగాలి పర్యటన చేసినట్లు సమచారం.