సిపికి వినతిపత్రం ఇస్తున్న విజయనిర్మల
ప్రజాశక్తి - ఆరిలోవ : ఆరిలోవ, ఎంవిపి కాలనీ, త్రీటౌన్ పోలీస్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, గంజాయి వాడకం దార్లపై ప్రత్యేక పోలీసు నిఘా పెట్టాలని తూర్పు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల కోరారు. నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్‌ను కలిసి వినతి పత్రం అందజేసారు. ఆరిలోవ, తోటగరువు హైస్కూలు, రవీంద్రనగర్ కొండవాలు ప్రాంతాలు, జోడుగుళ్ళపాలెం, ముడసర్లో పార్కు జాలారి పేట, శ్మశానవాటిక, అప్పుఘర్ తదితర ప్రాంతాల్లో విద్యార్ధులు, యువకులు గంజాయి, మత్తుపదార్ధాల ఎక్కువగా వాడుతున్నట్లు స్థానికులు తమ దృష్టికి తెచ్చారని, దీనిపై ప్రత్యేక నిఘా పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు










