ప్రజాశక్తి-తాడేపల్లి : గంజాయికి బానిస అవ్వడమే కాకుండా గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తాడేపల్లి సిఐ శేషగిరిరావు, ఎస్‌ఐ డి.రమేష్ సోమవారం వెల్లడించారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన కాకర్లపూడి అశోక్, తాడిగడపకు చెందిన దుర్గాప్రవీణ్, తాడేపల్లి ఇప్పటం గ్రామానికి చెందిన ఇండ్ల దుర్గాసాయితేజ, గాజుల వెంకటేశ్వరరావు, మంగళగిరి మండలం నవులూరుకు చెందిన కొల్లి సాయితేజ ముఠాగా ఏర్పడి గంజాయి అమ్ముతున్నారు. కాకర్లపూడి అశోక్ ప్రధాన సూత్రధారి కాగా గంజాయిని విశాఖపట్నం, పాడేరు ప్రాంతాల్లో నుండి తెచ్చి అమ్ముతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో యువకులకు అమ్ముతున్నారు. దీనిపై సమాచా రం అందుకున్న పోలీసులు ఇప్పటం శివారులో అరెస్టు చేసి వారి వద్ద నుండి కిలోన్నర గంజా యి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకు న్నారు. పట్టుబడ్డ ఐదుగుర్ని కోర్టులో హాజరుప రుస్తామని ఎస్‌ఐ పోలీసులు తెలిపారు.










