Apr 07,2023 00:28

పట్టుబడిన నిందితునితో పోలీసులు

ప్రజాశక్తి -సీలేరు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం... జికె.వీధి మండలం సీలేరు రామాలయం జంక్షన్‌ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బీటెక్‌ చదువుతున్న ముదిగొండ సాయి సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఆ విద్యార్థిని తనిఖీ చేయగా 24 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పట్టుబడిన గంజాయి, రూ.900 నగదు, ఒక సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదరు విద్యార్థిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించారు. గురువారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఎస్‌ఐ రామకృష్ణ హెచ్చరించారు.