ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో దోడిపుట్, మాకవరం పంచాయతీ పరిధి పలు గ్రామాల్లో 42 ఎకరాలల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేసినట్లు స్థానిక ఎస్సై కే.రవీంద్ర తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు దోడిపుట్, మాకవరం పంచాయతీ పరిధిలో బిడిచంప, రాంపూట్, మాకవరాం, కెందుపుట్ గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో 42 ఎకరాల గంజాయి మొక్కలను పోలీస్, ఏపీఎస్పీ సిబ్బందితో ధ్వంసం చేశారన్నారు. చట్ట వ్యతిరేక కార్యఫలాలకు పాల్పడితే ఎంతటి వారైనా కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో పర్యటనలు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. గంజాయి సాగుతో కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.అనేత మంది పట్టుబడి జైలు పాలయ్యారని ఆయన అన్నారు.కొంతమంది మాయమాటలు నమ్మి గంజాయి సాగు చేస్తున్నారని, అటువంటి వారి పై దృష్టి సారిస్తున్నామని ఎస్సై తెలిపారు.
డుంబ్రిగూడ:మండలంలోని కొర్రయి పంచాయతీ గ్రామాల్లో సాగు చేస్తున్న ఎకరం గంజాయి పంటను గురువారం స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గంజాయి పంటను సాగు చేసి గిరిజనులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.










