Aug 19,2023 22:20

గంజాయి స్వాధీనం చేసుకున్న వివరాలను వెల్లడిస్తున్న సిఐ

        ధర్మవరం టౌన్‌ : గంజాయిని అక్రమంగా అమ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతనివద్ద నుంచి ఒకటిన్నర కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్టు వన్‌ టౌన్‌ సిఐ సుబ్రమణ్యం తెలిపారు. శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో ఆరెస్టు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని తిక్కస్వామినగర్లో గంజాయి ఆకులు ఆమ్ముతున్న సమాచారం రావడంతో డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు దాడులు చేశారు. గంజాయి ఆకులు అమ్ముతున్న సాకేశంకర, ఆర్వేటి సాయిలును అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15వేలు విలువ చేసే గంజాయిను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు.