Feb 02,2023 22:30

ప్రజాశక్తి-వన్‌టౌన్‌, సింగ్‌నగర్‌
టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి అర కేజీ గంజాయి స్వాధీనం చేసుకుని గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు టూటౌన్‌ ఎస్‌ఐ షబీర్‌ అహ్మద్‌కు రాబడిన సమాచారం మేరకు గురువారం ఓల్డ్‌ ఆర్‌ఆర్‌ పేటకు చెందిన పిళ్లా మోహనరావు, కుమ్మరి వీధికి చెందిన సయ్యద్‌ సర్వర్‌ అలియాస్‌ బాజీలు గంజాయి అమ్ముతుండగా వారి వద్ద నుంచి అర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చారు. విజయవాడ రూరల్‌ ప్రాంతమైన వైఎస్‌ఆర్‌ కాలనీలోని పలు పాన్‌ షాపులు, పచారీ షాపులను టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. షాపుల్లో గంజాయి., ఇతర మాదక ద్రవ్యాలు ఏమైనా అమ్మకాలు జరుగుతున్నాయోమో అనే అనుమానంపై తనిఖీలు నిర్వహించినట్లు సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పాయకాపురం లక్ష్మీనగర్‌ వద్ద కేసర దేవందర్‌రెడ్డి, చక్రాల పవన్‌కుమార్‌, వంగిపరుపు దీపక్‌ల వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని నున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.