Mar 08,2023 00:48
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

ప్రజాశక్తి-చీరాల: గంజాయి విక్రయాలపై వన్‌టౌన్‌ పోలీసులు మెరుపు దాడులు నిర్వహిం చారు. ఈ క్రమంలో పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం.. కారంచేడు మండలం పేర్నమిట్టకు చెందిన కట్టా దుర్గా ప్రసాద్‌ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన కుంభా మాధవి నుంచి గంజాయి కొనుగోలు చేసి చీరాల చుట్టుపక్కల విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి చీరాల మునిసిపల్‌ పరిధిలోని ఉజిలీపేట సమీపంలో విక్రయిస్తున్న అతనిపై దాడుల నిర్వహించి అతని వద్ద గల 2 కిలోల గంజాయిని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుర్గా ప్రసాద్‌, మాధవిలపై కేసు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా రామకృష్ణాపురంలో భద్రాద్రి నాని అనే వ్యక్తి నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ తెలిపారు. గంజాయిలో 100 గ్రాములు పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు సిఐ తెలిపారు.