గంజాయి రవాణా పట్టివేత
ప్రజాశక్తి - గూడూరు: తిరుపతి ఎస్‌పి పి పరమేశ్వర్ రెడ్డి తిరుపతి జిల్లా డిఎస్‌ఇఓ (ఏఎస్‌పి, సెబ్ ) ఎ రాజేంద్ర ఆదేశాల మేరకు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలలో గంజా యిపై గూడూరు సెబ్ టీమ్ శనివారం తనిఖీలు నిర్వహిం చారు. ఈ తనిఖీలలో గంజాయి కలిగి ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని (ఎ1)ను అరెస్టుచేసి అతని వద్ద నుండి 3 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో ఇద్దరు వ్యక్తులను ( ఏ 2, ఏ 3)లను గుర్తించారు. ఒడిశాలోని మల్కాన్ గిరికి చెందిన ఈశ్వర్ మడ్కామి ఎ1గాను, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి చెందిన మౌలాలి అలియాస్ ఆలీ ఎ2గా, బెంగళూరుకు చెందిన మనోజ్,ను ఎ3గాగుర్తించారు. ఎ2, ఎ3 లు ఇద్దరిని త్వరలోనే అరెస్టు చేస్తామని వివరించారు. నిందితుల కథనం మేరకు.. స్నేహితుడైన (ఏ 2) మౌలాలి వద్ద నుండి (3) కేజీల గంజాయిని తీసుకుని బెంగళూరులో ఉన్న ఎ3 మనోజ్‌కు గంజాయిని చేరవేస్తే ఈశ్వర్ కు మౌలాలి అనే వ్యక్తి రూ.5వేలు ఇస్తాడని తెలిపారు. బెంగుళూరులో ఈ గంజాయి విలువ ఒక్కో కేజీ 20 వేల రూపాయలు ఉంటుందని అంచనా. దీని విలువ మొత్తం 60 వేల రూపాయలు ఉంటుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా సమాచారం తెలిసిన వారు టోల్ ఫ్రీ నెంబర్ 14500కు తెలపవచ్చన్నారు. ఈ దాడులలో గూడూరు సెబ్ టీమ్ గూడూరు సెబ్ టీం బీ సీఐ , పి విజరుకుమార్, ఎస్‌ఐ ఏ శేషమ్మ, హెచ్ సి యమ్ కిరణ్ సింగ్, పి రమేష్ , ఎస్ కె బాష, టీజీ ఆనందబాబును ఉన్నతాధికారులు అభినందించారు.










