Apr 01,2023 21:38

ప్రజాశక్తి - మండవల్లి
              ఏలూరును గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకు న్నామని ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ తొలగించబడుతున్న నేపథ్యంలో నూతన పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి కేటాయించనున్న స్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయిని అరికట్టాడానికి చర్యలు చేపట్టామన్నారు. కైకలూరు, తదితర ప్రాంతాల్లో గంజాయిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు 2021తో పోలిస్తే 2022లో తగ్గుముఖం పట్టాయన్నారు. పూర్తి స్థాయిలో స్పందన నిర్వహిస్తున్నామని, మండల స్థాయిలో పరిష్కారం కానీ కేసులను జిల్లా స్థాయిలో విచారించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. అనంతరం స్థల విషయంపై విఆర్‌ఒ కమల్‌హా సన్‌ను, ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు టౌన్‌, రూరల్‌ సిఐలు నాగరాజు, వైవిఎల్‌.నాయుడు, ఎస్‌ఐలు షణ్ముఖ సాయి, రామకృష్ణ, ఎఎస్‌ఐ కాకులు రాజు పాల్గొన్నారు.