గంజాయి పట్టివేత
ప్రజాశక్తి -గూడూరు: తిరుపతి జిల్లా ఎస్పి పి. పరమేశ్వర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా డి ఎస్ ఇ ఓ ( ఏఎస్పి, సెబ్ ) అధికారి అయిన ఏ . రాజేంద్ర ఆదేశాల మేరకు ఈరోజు అనగా ఉదయం 3 గంటల నుంచి చిల్లకూరు మండల పరిధిలోని బూధనం టోల్ ఫ్లాజా వద్ద ఎన్ హెచ్ 16 పైన గూడూరు సెబ్ టీమ్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ వాహనాల తనిఖీలో తణుకు డిపో కి చెందిన, తణుకు నుండి తిరుపతికి వెళుతున్న ఎపి 03 5622నెంబరు గల ఏపీఎస్ ఆర్టీసి సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న గంజాయి కలిగిన తమిళనాడు మధురై కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి 16 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహేష్ తండ్రి చెల్లదురై, వయస్సు 23 ఏళ్లు వుంటుందని మధురైకి చెందిన వ్యక్తి అని తెలిపారు. ముత్తు అమ్మాల్, భర్త సత్యమూర్తి, వయస్సు 38 సంవత్సరాలు వుంటుంది. మధురైకి చెందిన వ్యక్తులు విచారణలో తేలింది. మధురై కి చెందిన మహేష్ కు స్నేహితుడైన శివ అనే వ్యక్తి వీరిద్దరిని గంజాయి తీసుకురమ్మని విజయవాడ ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌కు పంపాడు. శివకు తెలిసిన వ్యక్తి ఈ 16 కేజీల గంజాయిని వీరికి విజయవాడ బస్టాండ్ లో ఇచ్చాడు. గంజాయిని తెచ్చి ఇచ్చినందుకు శివ వీరికి రూ.5వేలు చొప్పున ఇచ్చాడు. శివ ఈ గంజాయిని ఒక్కో కేజీ 20 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.3,20,000ల కు మధురై చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్ముతాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. రెండు సంవత్సరాల కాలంలో గూడూరు సెబ్ టీమ్ గంజాయి నేరాలపై విస్తతంగా దాడులు నిర్వహించి,46 కేసులు నమోదు చేసి, 96 మందిని అరెస్టు చేశారు. 543 కేజీల గంజాయిని, రెండు కార్లను సీజ్ చేశారు. గంజాయి ఖిల్లాగా పేరుబడ్డ గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో విస్తతంగా దాడులు నిర్వహించి, అక్కడ గంజాయిని పూర్తిగా నియంత్రించామని తెలిపారు. ఈ దాడులలో గూడూరు సెబ్ టీమ్ సీఐ ,పి విజరు కుమార్, ఎస్ ఐ , ఏ శేషమ్మ, హెచ్ ఎం కిరణ్ సింగ్ పి . రమేష్, వి.ఎన్ ప్రసాద్, ఎం . కష్ణ, ఎస్ కె భాష,టీజి ఆనందబాబు, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.










