Jul 15,2023 00:07

మాట్లాడుతున్న సిఐ రుద్రశేఖర్‌

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడు ముత్తెం రవి(30)ను శుక్రవారం అరెస్టు చేసినట్లు అరకులోయ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సిహెచ్‌ రుద్రశేఖర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ, నిందితుడు ముత్తెం రవి 2021సంవత్సరంలో 1150 కిలోల గంజాయి రవాణాలో పాల్గొన్నారన్నారు. ఆ కేసులో నిందితుడు పరారీలో ఉండేడని అతనిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సంతోష్‌ పాల్గొన్నారు.