ప్రజాశక్తి -హుకుంపేట:మండలంలోని
గంజాయి, నాటుసారాపై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసి రవాణాకు అడ్డుకట్టు వేయాలని జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా తెలిపారు. మండలంలోని బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రికార్డులు, కేసు వివరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సేవా భావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గ్రామ ప్రజల ఫిర్యాదులపై పూర్వ పరాలు పరిశీలించి సమస్య పరిష్కారం చేయాలన్నారు. యువతి యువకులను చెడు వ్యసనాల నుంచి దూరం చేసేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, నాటు సారా రవాణా చట్టరీత్యా నేరమన్నారు. మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు.అనంతరం కానిస్టేబుల్ మోహన్ దాస్, త్రినాథ్‌లకు క్యాష్ రివార్డులను అందజేేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్పి రాజ్, సిఐ సుధాకర్, స్థానిక ఎస్‌ఐ సతీష్ పాల్గొన్నారు.










