ప్రతి జిల్లాలోనూ సైబర్‌క్రైమ్ కౌంటర్లు
విలేకరుల సమావేశంలో డిజిపి రాజేంద్రనాథరెడ్డి
కడప ప్రతినిధి : రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ మూలాలపై దృష్టి పెట్టామనీ, పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి స్మగ్లింగ్ రవాణా నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిజిపి రాజేంధ్రనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్‌ఆర్ జిల్లాలోని ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా గంజాయి స్మగ్లింగ్ నివారణకు పోలీసులు దృష్టి సారించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌క్రైమ్ నివారణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల మంది మహిళల మిస్సింగ్ అవాస్తమని చెప్పారు. 2019 నుంచి 2021 వరకు చోటుచేసుకున్న మిస్సింగ్ కేసులు తాజా ఎన్‌సిఆర్‌బి నివేదికలో కలిపిన కారణంగా పెరుగుదల కనిపిస్తోందని వివరించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు పునరావృతం గాకుండా చూడాలని ఆదేశించామని చెప్పారు. మహిళా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఫలితంగా మహిళలపై వేధింపులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. దీనికితోడు దిశా చట్టం అమలు కారణంగా మహిళలకు రక్షణ కల్పించా మన్నారు. 100 మహిళల వేధింపుల కేసుల్లో శిక్షలు పడేలా చేశామని చెప్పారు. లోక్‌అదాలత్‌ల్లో 1.07 లక్షల కేసులు పరిష్కారమయ్యా యన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసు కున్నామని తెలిపారు. చోరీలు, మహిళల వేధింపులు, హత్యలు, హత్యాయత్నం కేసులు నాలుగు శాతం మేరకు తగ్గాయని తెలిపారు. ఎస్‌ఐ, సిఐ ప్రమోషన్లు చేపడతామని తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల నియమకం కోర్టు పరిధిలో ఉండడంతో చేపట్టలేకపోతున్నామని తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లా పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందన్నారు. మూడేళ్లతో పోలిస్తే క్రౖెెం రేట్ చాలా తగ్గిందని చెప్పారు. కేసుల గణాంకాల ఆధారంగా విమర్శలు చేస్తే బాగుంటుందని తెలిపారు. కడప జిల్లాలో 2.1 శాతం నుంచి 1.7 శాతానికి, అన్నమ య్య జిల్లాలో 15 శాతానికి తగ్గిందని చెప్పారు. విలేకరుల సమావేశంలో కడప, అన్నమయ్య జిల్లాలు ఎస్పీ అన్బురాజన్, గంగాధర్‌రావు పాల్గొన్నారు.










