
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
గంజాయి కేసులో మూడో ముద్దాయిని అరెస్టు చేసినట్లు సిఐ బి.వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో 2022లో ట్రాలీ లారీలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ కేసులో అప్పట్లో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మూడో ముద్దాయి మొగ్గ రామారావు పరారీలో ఉండగా అతడిని శుక్రవారం రాత్రి తాటియాకులగూడెం టెంపుల్ వద్ద అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ వి.చంద్రశేఖర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.