May 12,2023 23:10

అవగాహన కల్పిస్తున అధికారులు

ప్రజాశక్తి-పెదబయలురూరల్‌:కిముడుపల్లి పంచాయితీ గ్రామాలలో గిరి రైతులు, యువకులకుస్థానిక ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌, తహసిల్దార్‌ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో గంజాయి సాగు, రవాణాతో కలిగే అనర్థాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణాకు యువకుల పైలెట్‌లు వంటివి చేయకూడదని సూచించారు. గంజాయి సాగు చేస్తే రైతులను బైండోవర్‌ చేయడం జరుగు తుందన్నారు. యువకులు గంజాయి కేసులో పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అర్హత లేకుండా ఉంటారని తెలిపారు. వీటికి దూరంగా ఉండాలన్నారు.