Sep 19,2022 00:11

శిబిరానికి హాజరైన ప్రజలు

ప్రజాశక్తి -గాజువాక : గంగవరంలో హెచ్‌సిజి కేన్సర్‌ కేర్‌, స్టార్‌ పినాకిల్‌ హార్ట్‌ సెంటర్‌ వారి సౌజన్యంతో స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు), భారత ప్రజాతంత్ర యుజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యాన ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. కార్మికుల సమస్యలపై పోరాడటమే కాకుండా ప్రజలకు సేవలందించడంలోనూ సిఐటియు ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. ఈ క్యాంపు నిర్వహణలో డివైఎఫ్‌ఐ యువకులు చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. వైద్య శిబిరంలో సేవలందించిన డాక్టర్లను ఆయన అభినందించారు. 204 మందిని వైద్యులు పరీక్షించారు. వీరిలో 20 మందికి కేన్సర్‌ సంబంధిత, ఐదుగురికి గుండె సంబంధిత వ్యాధులను గుర్తించారు. ఈ శిబిరంలో డాక్టర్‌ ఫణిశేఖర్‌, డాక్టర్‌ కుమారి, డాక్టర్‌ సునీల్‌, డాక్టర్‌ సువర్ణ, స్టార్‌ పినాకిల్‌ హార్ట్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎన్‌వి నాగేశ్వరరావు, హెచ్‌సిజి కేన్సర్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ అనీల్‌గోపి, పారామెడికల్‌ సిబ్బంది, ఆశా వర్కర్లు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు వి.గణేష్‌, చంద్రమౌళి, కామేశ్వరరావు, సిఐటియు నాయకులు కొవిరి అప్పలరాజు, పేర్ల మసేను, ఉమ్మడి సోమేష్‌, వాసుపిల్లి సోమేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు కంబాల మహేష్‌, కంబాల శివ, యెరిపిల్లి ప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.