ప్రజాశక్తి -గాజువాక అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్ టెక్ సిఎస్‌ఆర్-2022 అవార్డును, గంగవరం పోర్టు గెలుచుకొంది. సిఎస్‌ఆర్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవంలో అసోం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి బిమల్ బోరా చేతుల మీదగా గంగవరం పోర్టు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి.జ్యోతి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గంగవరం పరిసర గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పన, గ్రామీణాభివద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు. గంగవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీని గంగవరం పోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, సుస్థిర అభివృద్ధి, సమాజ సంక్షేమం అత్యంత ప్రాధాన్యతాంశాలుగా సిఎస్‌ఆర్ కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.










