Oct 08,2022 23:10

హెచ్‌ఒడికి వినతిపత్రం అందజేస్తున్న దేవన్‌రెడ్డి.

ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టుకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వైసిపి గాజువాక నియోజకవర్గ నేతలు కోరారు. ఈ మేరక నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్మిన్‌ బిల్డింగ్‌ హెచ్‌ఒడికి శనివారం వినతిపత్రం అందజేశారు. స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే రహదారి ఆక్రమణకు కావడంతో ఇరుకుగా మారిందని, దీనికి తోడు రోడ్డు బాగా పాడవ్వడంతో అటుగా వెళ్లే ఉద్యోగులు, కార్మికులతోపాటు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాగే. స్టీల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ వర్కర్ల వాహనాలకు వెహికల్‌ పాసులు మంజూరు చేయాలని, లేదా గేటు ఎదురుగా వెహికల్స్‌ షెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సిఎస్‌ఆర్‌ నిధులను కేటాయించి, నిర్వాసిత కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నేతలు పిట్ట రెడ్డి రమణ, మస్తానప్ప రెడ్డి, బొడ్డ గోవిందు పాల్గొన్నారు.