Aug 07,2023 00:21

మాట్లాడుతున్న పులి రమణారెడ్డి

ప్రజాశక్తి- గాజువాక : అదాని గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితుల సంఘం నాయకులు పులి రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలు ఆదివారం నాటికి 33వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను రమణారెడ్డి ఆదివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలని, తొలగించిన కార్మికులను విధులలో చేర్చుకోవాలని డిమాండ్‌చేశారు. సమస్య జటిలం కాకుండా పరిష్కరించాలని యాజమాన్యానికి సూచించారు. నిర్వాసిత నాయకులు గోందేశి సత్యారావు, వైసిపి నాయకులు గొందేసి మహేశ్వరరెడ్డి, గంట్యాడ గురుమూర్తి, ప్రభాకర్‌ రెడ్డి, తెలుగుదేశం నాయకులు ముడసిరి శ్రీనివాసరావు, సుమన్‌రెడ్డి, బస అప్పలరెడ్డి, అప్పారావు, గోపి, అప్పలరాజు, తాతారావు, యళ్లాజీరావు, పోలారావు, బాలకృష్ణ, నూకరాజు, అప్పారావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.