గోరంట్ల రూరల్ : గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దొంగతనంగా గంధపు చెట్లను నరికి వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసి కర్నాటక రాష్ట్రానికి అమ్మేందుకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనంలో తీసుకెళ్తున్న గంధపు చెక్కుల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ గోరంట్ల పట్టణం రావికుంట చెరువు సమీపంలో నివాసం ఉన్న దేశయ్య, అతని కుమారుడు గజేంద్ర చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామ శివారులోని అడవిలో దొంగతనంగా గంధపు చెట్లను నరికి తీసుకొచ్చిన తీసుకొచ్చిన దుంగలను చిన్నచిన్న ముక్కలుగా చేసి కర్ణాటక రాష్ట్రం సిరా పట్టణానికి అమ్మటానికి వెళ్తున్న సందర్భంలో బూదిలి పంచాయతీ గొల్లపల్లి క్రాస్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.










