Sep 13,2023 23:37

రక్తదానం చేస్తున్న యువకులు

ప్రజాశక్తి- ఆనందపురం : ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ ఒఎస్‌జి ఫౌండేషన్‌, స్నేహ మిత్ర ఆర్మీ యూత్‌ క్లబ్‌ సంయుక్తంగా న్యూ లైఫ్‌ బ్లడ్‌ సెంటర్‌ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి చైల్డ్‌రైట్స్‌ కమిషనర్‌ గొండు సీతారాం, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ ఎస్‌.రేనుకయ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఒఎస్‌జి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శివ దళాయికి ఇది 32 రక్తదాన శిబిరం. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు దినేష్‌, రాజేష్‌, చందు, సాయి, మధురిమ, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.