డెంగీ కేసు నమోదైన ఇంటి వద్ద స్ప్రే చేయిస్తున్న వైద్య సిబ్బంది
ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం గంభీరం సచివాలయం యాతపేట ఎస్‌టి కాలనీలో డెంగీ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన సిహెచ్.ఆశ (28) జ్వరంతో బాధపడుతూ పరీక్షలు చేసుకోక డెంగీ నిర్ధారణ అయింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలో పర్యటించి జ్వరాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించారు. గ్రామ పరిసరాల్లో క్లోరినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్యాధికారి పి.సాంబమూర్తి, ఆరోగ్య పర్యవేక్షకులు సన్యాసిరావు, ఆరోగ్యకార్యకర్తలు ఎం.సత్యవతి, అప్పలరాజు, ఆశా కార్యకర్తలు కొండమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.










