Mar 07,2023 23:45

తాళ్లపాలెం జంక్షన్‌లో సంబరాలు చేస్తున్న గున్నయ్యనాయుడు, వైసిపి నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి
విశాఖపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ జయప్రదమైందంటూ పట్టణంలోని వైసిపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్నడు జరగని విధంగా ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ జరిగిందన్నారు. ఈ సదస్సు ద్వారా అనకాపల్లి జిల్లాకు లక్ష 21 వేల కోట్ల రూపాయల పరిశ్రమలను తీసుకొస్తున్న ఘనత మంత్రి అమర్నాథ్‌కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జి రామ్మూర్తి, అంటాకుల రత్న కుమారి, కార్పొరేటర్‌ మందపాటి సునీత, నాయకులు కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్‌, పలక రవి, పెతకంశెట్టి జగన్మోహన్‌, గైపూరి రాజు, కోరుకొండ రాఘవ, దాడి నారాయణరావు పాల్గొన్నారు.
కశింకోట : పారిశ్రామిక సదస్సు విజయవంతమైన నేపథ్యంలో మంగళవారం మండలంలోని తాళ్లపాలెం జంక్షన్‌లో కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మి భర్త గున్నయ్య నాయుడు ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేశారు. టపాసులు కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన సీఎం జగన్మోహన్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మలసాల కిషోర్‌, వియ్యపు భూలోక నాయుడు, కరకు సోమునాయుడు, హనుమంతు వెంకట లక్ష్మణరావు, కొట్టే రాము, కరణం శాంసన్‌, గొంతెన శివ బాబు, తెరపల్లి సంతోష్‌, నమ్మి గణేష్‌, లగిశెట్టి గణేష్‌, కోన నాగేశ్వరరావు, నీటిపల్లి దివాకర్‌, అద్దంకి సతీష్‌, ఇందల ముసలి నాయుడు, చిన్ని రాజీవ్‌, గాలి శ్రీనివాస రావు, కొప్పాక రామ గణేష్‌, కరకు శేషు పాల్గొన్నారు.a