గల్లా రామచంద్ర నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం
ప్రజాశక్తి- తిరుపతిబ్యూరో: అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లాను ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు)తో సత్కరించారు. తయారీ రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలను దష్టిలో ఉంచుకుని ఈగుర్తింపు అందజేశారు. ఈనెల 11న బెంగుళూరులోని సత్యసాయి విశ్వవిద్యాలయం ముద్దనహళ్లి వద్ద జరిగిన ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ 2023లో ఈ అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ గల్లా విశేషమైన కషి తయారీ పరిశ్రమను ఉన్నత స్థాయికి చేర్చడమే కాకుండా దేశ వద్ధికి గణనీయంగా దోహదపడింది. 85 సంవత్సరాల వయసున్న డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు సాంకేతిక నిపుణునిగా, వ్యవస్థాపకునిగా, దాతగా ప్రసిద్ధి చెందిన మహోన్నత వ్యక్తి. సామాజిక అవరోధాలను అధిగమించిన ఆయన, పరివర్తనాత్మక మార్పును తీసుకురావడానికి అవిశ్రాంతంగా కషి చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా డాక్టర్ గల్లా ధడ సంకల్పం అమర రాజా గ్రూప్‌ను అంతర్జాతీయ సంస్థగా మార్చింది. తయారీ రంగంలో డాక్టర్ గల్లా అసాధారణమైన, విశిష్టమైన కషికి నిదర్శనంగా ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు నిలుస్తుంది. వ్యవసాయ కమ్యూనిటీకి తగిన అవకాశాలను అందించడానికి, అమర రాజా గ్రూప్ కంపెనీలలో ఒకటైన గల్లా ఫుడ్స్, నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి, మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇవ్వడానికి 3000 మంది రైతులతో కలిసి పని చేస్తుంది. మరో గ్రూప్ కంపెనీ - అమర రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగంలో గ్రామీణ మహిళలకు పెద్దమొత్తంలో ఉపాధి అందిస్తోంది. మదుపరులు, కార్పొరేట్ నాయకులు, వ్యాపార సలహాదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో సహావివిధ వాటాదారులను ఏకం చేసే వేదికగా 2023 నిలిచింది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం నేపథ్యం ఇన్నోవేషన్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్, గ్రామీణ ఆవిష్కరణలు, వ్యవస్థాపకతపై గణనీయమైన స్థాయిలో దృష్టిని కేంద్రీకరించింది. ఈ ప్రదర్శనను సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ ప్రారంభించారు.










