
జమ్మలమడుగు రూరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గజదొంగల రాజ్యం నడుస్తుందని వక్తలు పేర్కొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో చేపట్టిన బస్సు యాత్ర గురువారం జమ్మలమడుగుకు చేరింది. ముందుగా ఎద్దుల ఈశ్వర రెడ్డి విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ మాట్లాడుతూ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలనే ఉద్దేశంతో బస్సు యాత్రను ప్రారంభి ంచామన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా వైన్స్, ఇసుకను అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో దొంగల ముఠా రాజ్యమేలుతుందని వాపోయారు. కడప ఉక్కు పరిశ్రమకు నాలుగు సార్లు శంకుస్థాపన చేశారని, కనీసం నాలుగు అడుగులు కూడా పడలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇసుకను అమ్ము కుంటున్నారని పేపర్లలో చదివానని తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎస్సి, ఎస్టీలకు ఇచ్చిన భూములను లాక్కోవడం సిగ్గు చేటన్నారు. అనంతరం పిసిసి మీడియా చైర్మన్ తులసి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ 9 సంవత్సరాలలో 109 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రయివట్ వ్యక్తులకు తాకట్టు పెడుతుందని వివరించారు. 13 మంది ప్రధాన మంత్రులు కలిసి 67 సంవత్సరాలలో రూ. 46 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈయన మాత్రం తొమ్మిది ఏళ్లలోనే 109 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చా రన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ఫీజుబిలిటీ లేదనడం సరి కాదన్నారు. నేడు రాష్ట్రంలోని బిజెపి ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చెప్పడం, అంతలోనే కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ నిర్మించడం సాధ్యం కాదని పార్లమెంట్‌లో ప్రకటించడం చూ స్తుంటే రెండు నాలుకల ధోరణిని గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్ర, కడప జిల్లా ప్రజలకు ఊరి స్తోందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్య పెట్టకుండా, కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని లేకుంటే రాష్ట్రంలో రెండు పార్టీలకు పుట్టగతులు ఉండవని హె చ్చరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారా యణరెడ్డి, సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులు ఓబులేసు, ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ప్రసంగించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమి టీ కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, ప్రసాద్, సిపిఎం నాయకులు వీరణాల శివ నారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్, విజరు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వినరు పాల్గొన్నారు.