Aug 09,2023 22:13

కొండలపై సంచరిస్తున్న ఏనుగుల గుంపు

ప్రజాశక్తి - కురుపాం : మండలంలో తిత్తిరి పంచాయతీలోని గిరిశిఖర గ్రామాల్లో బుధవారం నాలుగు ఏనుగుల గుంపు సంచారించింది. గిరిజనుల సాగు చేస్తున్న కొండచీపుర్లు, అరటి, పసుపు తదితర అటవీ ఉత్పత్తులను, తాగునీటి పైపులు, ట్యాంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న గిరి శిఖర గ్రామాల్లో ఏనుగులు సంచరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గిరిజనులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తెల్లవారితే కొండ ప్రాంతంలో పనిచేసుకుంటూ అటవీ ఫలసాయాలను ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటామని, ఏనుగుల సంచారంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.