Sep 28,2023 23:22

ప్రజాశక్తి - బాపట్ల
గిరిజనులు పంతం పడితే జగన్మోహన్ రెడ్డి అంతం చూస్తారని బాపట్ల పార్లమెంటు టిడిపి గిరిజన విభగం అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇంచార్జ్  వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఎస్‌టి సెల్ నాయకులు బాపట్లలో గురువారం రిలే నిరాహార దీక్షలు చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమాన్ని కాంక్షించి, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడం కోసం టిడిపి ప్రభుత్వంలో అనేక పధకాలు అమలు చేశారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. బాక్సైట్‌ను త్రవ్వు కుంటూ లక్షలాది ఎకరాల గిరిజన భూములను సెజ్ల పేరుతో అన్యక్రాంతం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును నిర్దోషిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ కార్యదర్శి చుక్కా పాల్‌రాజ్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఇండ్ల శ్రీనివాసరావు, పార్లమెంట్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు నంబూరి ఏడుకొండలు, స్టువర్టుపురం ఎస్టీ నాయకులు బల్లాని నాగరాజు, కర్లపాలెం మండల ఎస్టీ సెల్ నాయకురాలు కట్టా సుజాత, వీరయ్య, నంబూరి నాంచారయ్య, గున్నం అంకమ్మరావు, గోసు రాంబాబు, చౌటురి ఏడుకొండలు, మోటా జాన్, ఉయ్యాల శివ, గోలి వెంకటేష్, దేవరకొండ శ్రీను, కోనేటి రాఘవులు, కొమరగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.