Jul 28,2023 00:00

సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం

ప్రజాశక్తి-కోటవురట్ల:అణుకు గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల సౌకర్యం కల్పించాలని గిరిజనులు చేపట్టిన దీక్షలకు ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం విమర్శించారు. 21 రోజులుగా గిరిజనులు చేపడుతున్న దీక్షలకు గురువారం ఆయన మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలపై ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన గ్రామానికి పాఠశాల, రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మౌలిక సదుపాయాలు వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు అప్పలరాజు, డేవిడ్‌రాజు, సత్యనారాయణ, రాజుబాబు, రమేష్‌, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.