కొండపై నుంచి డోలీతో రోగికి ఆస్పత్రికి తరలిస్తున్న గిరిజనులు
ప్రజాశక్తి - పాచిపెంట : స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లయినా గిరిజన గ్రామాలకు పక్క రహదారి సౌకర్యాలు లేక అనారోగ్య పరిస్థితుల్లో గిరిజనులకు డోలి మోతలు ఇప్పటికీ తప్పడం లేదు. మండలంలోని మూటకూడునుండి గళ్లపాడు వరకు సుమారు మూడు కిలోమీటర్ల వరకూ సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మూటకూడుకు చెందిన సేబి నరసయ్యను డోలీపై మైదాన ప్రాంతాలకు తరలించారు. సేవి నరసయ్య జ్వరం, దగ్గు, ఆయాసంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గ్రామస్తులు నరసయ్యను డోలీపై మైదాన ప్రాంతాలకు తీసుకువచ్చి ఆటోపై మెరుగైన వైద్యం కోసం సాలూరు సిహెచ్‌సికి తరలించారు.










