Jan 14,2023 23:25

మాట్లాడుతున్న అఖిల పక్షం పార్టీల నేతలు

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజనులు షాపులు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలని అఖిలపక్షం నేతలు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో గిరిజన సంఘం భవనంలో అన్ని పార్టీల నేతలు గిరిజన ప్రజలతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గిరిజన సంఘం, అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ, మండల కేంద్రంలో గిరిజనులకు షాపులు కట్టుకోవడానికి రోడ్డు పక్కల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పీసా, 1/70 గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ఇల్లు, షాపులను గిరిజనేతరులు కట్టు కుంటున్నారని రెవెన్యూ యంత్రాంగం చూస్తూ ఊరు కుంటుందన్నారు. గిరిజనేతరుల ఆక్రమ కట్టడాలు వెంటనే కూల్చాలని నాయకులు డిమాండ్‌ చేశారు. గిరిజనులకు 100శాతం రిజర్వేషన్లను కేటాయించాలన్నారు. గిరిజనులకే షాపుల నిర్మాణానికి స్థలాలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రేగం మత్స్యలింగం, మాజీ జడ్పీటీసీ కొర్ర కాసులమ్మ, వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, తడిగిరి సర్పంచ్‌, డీఎల్‌ఓ నాయకులు పెనుమల రంజిత్‌ కుమార్‌, గత్తుం పంచాయితీ సర్పంచ్‌ పాడి పోతురాజు, మెరకచింత మాజీ సర్పంచ్‌, సీపీఎం మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణ్‌రావు, గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి కిల్లో రామారావు, తాపుల కృష్ణారావు, టీడీపీ నాయకులు, హుకుంపేట వార్డ్‌ మెంబర్‌ పాడి వెంకట్‌, వైసీపీ నాయకులు గండేరు సత్యం, పాంగి కృష్ణారావు, చిట్టిబాబు, కైలాష్‌, చంద్రబాబు, లక్ష్మణ్‌, మల్లన్న, నాని, రామారావు, చిట్టిబాబు, మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.