Aug 01,2023 22:09

పెద్ద పల్లకి వలస గ్రామాన్ని సందర్శించిన అధికారులు

ప్రజాశక్తి -సీతంపేట : గిరిజనులకు సక్రమంగా సక్రమంగా వైద్యమందించాలని మలేరియా జోనల్‌ అధికారి కె.మధుసూదనరావు అన్నారు. మంగళ వారం ఆయన జిల్లాలో పర్యటించారు ఈ సంద్భంగా పాలకొండ ఏరియా హాస్పిటల్‌ను సందర్శించారు. అక్కడ డెంగీ పరీక్షలు చేసే పరికరాన్ని పరిశీలించి, నిర్వహించే పరీక్షల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాలకొండ సబ్‌ యూనిట్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అలాగే డిప్యూటీ డిఎంహెచ్‌ఒ చిరంజీవి, ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ నాగభూషణరావుకు, మలేరియా, డెంగీ కేసులు పరీక్షలు స్క్రీనింగ్‌ జరిపి, వచ్చిన పాజిటివ్‌ కేసులను సబ ఱష్ట్రఱజూ, ష్ట్రఎటష పోర్టల్‌లో నమోదు జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం సీతంపేట ఐటిడిఎ పరిధిలోని గిరిజన ప్రాథమిక అరోగ్య కేంద్రాలు కుసిమి, దోనుబాయి పిహెచ్‌సిలను సందర్శించారు. మలేరియా, డెంగీ వ్యాధులు దోమలు ద్వారా వ్యాపిస్తాయి. కనుక వ్యాధికారక, కింది స్థాయి సిబ్బంది ద్వారా సక్రమంగా విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. అలాగే రెండు ల్యాబ్‌లు పరీక్షించారు. వర్షా కాలంలో మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, సిబ్బంది ఇంటింటా ఫేవర్‌ సర్వే జరిపి, జ్వర పీడితులను గుర్తించి సక్రమంగా వైద్యం అందేలా పర్యవేక్షక సిబ్బంది చూడాలని ఆదేశించారు. అలాగే సిబ్బంది అలసత్వం వహిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పల్లంకి వలస గ్రామాన్ని సందర్శించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ డైరక్టర్‌ మలేరియా అధికారి కెవి ప్రసాద్‌, డిఎంఒ శ్యాంకుమార్‌, వైద్యాధికారి భానుప్రతాప్‌, రవీంద్ర, సబ్‌యూనిట్‌ అధికారి మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.