ప్రజాశక్తి- సీలేరు
జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో సిఆర్‌పిఎఫ్ జి42 బెటాలియన్ డిఎస్‌పి సురేష్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులకు రేడియోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఆర్‌పిఎఫ్ సెకండ్ ఇన్ కమాండ్ సురేష్ బాబు, జీకే వీధి సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే పోలీసులకు ప్రజలు బాగా చేరువయ్యారని తెలిపారు. వారికి ఎటువంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులు వద్దకు వస్తున్నారన్నారు. సివిల్ యక్షన్ ప్రోగ్రాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. సీలేరు, దుప్పిలివాడ పంచాయతీ పరిధిలో చింతపల్లి క్యాంప్, లైకన్ పూర్, చంద్రుర పల్లి, పార్వతి నగర్, బూసి కొండ, కాట్రగడ్డ, పిల్లిగెడ్డ గ్రామాల్లో 50 మంది గిరిజనులకు ఫిలిప్స్ రేడియోల పంపిణీ చేశారు. అనంతరం సివిక్ యాక్షన్ ప్రోగ్రాంకి హాజరైన ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి, ఏపీ జెన్కో ఈఈ జాకీర్ హుస్సేన్, ఏడిఈ క్యాంపు అప్పలనాయుడు. ఏఈ కష్ణారావు, స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ సీఆర్‌పిఎఫ్, సివిల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.










