Sep 28,2023 20:04

మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-నెల్లూరు :యానదులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే వరకు తమ పోరాటం సాగుతుందని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ధ్యక్షుడు కేసి పెంచలయ్య పేర్కొన్నారు. గురువారం నగరంలోని స్థానిక జెట్టి శేషారెడ్డి భవనంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కెసి పెంచలయ్య మాట్లాడుతూ యానాదులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే వరకు గిరిజనులందరూ ఐక్యంగా పోరాట బాట పట్టాలన్నారు. జనవరిలో యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు కళ్ళు తెరిపించేలా నెల్లూరు నగరంలో ధూమ్‌ ధామ్‌ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. నగర మేయర్‌ పోతులూరి స్రవంతి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ చక్రవర్తి, వెంకట సుబ్బయ్య, చేవూరు సుబ్బారావు, తలపల జయ వర్ధన్‌ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో అన్ని జిల్లాల ప్రతినిధులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.