Jul 06,2023 23:56

రేంజర్‌కు వినతిపత్రం ఇస్తున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశకి- అనంతగిరి :గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు సాగు హక్కు పత్రాలు మంజూరు చెయ్యాలని స్దానిక సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు కోరారు. గురువారం పారేస్టు రేంజర్‌ దుర్గప్రసాద్‌ ను కలసి లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ మండలంలో కొత్తూరు పంచాయతీ కొత్తవలస, ఎన్‌ఆర్‌ పురం పంచాయతీ బూరుగ, చినకోనేల, కరకవలస గ్రామాలకు అటవీ పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పోడుభూములే తప్ప, మరే జీవనాధారం లేని గిరిజన సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. భూహక్కు పత్రాలు లేకపోవడంతో ఉపాధి పనులు లేక, రైతు భరోసా దక్కక గిరిజన రైతులు నష్టపోతున్నారని రేంజర్‌కు విన్నవించారు. తక్షణమే స్పందించి సాగుహక్కు పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు.రొంపల్లి పంచాయతీ బూరుగలో 40 కుటుంబాలు, చినకోనేలలో 42 కుటుంబాలు, కరకవలసలో 36 కుటుంబాల గిరిజనులు సాగుహక్కు పట్టాలు దక్కక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో టోకూరు సర్పంచ్‌ కిల్లో మొస్య, సిపిఎం మండల నేత కాకర. సింగులు,
బాధిత గిరిజన రైతులు, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి సత్యం బీట్‌ అధికారులు పాల్గొన్నారు.