సమావేశంలో మాట్లాడుతున్న డి ఎం అండ్ హెచ్ ఓ
గిరిజనులకు మెరుగైన వైద్యం : డిఎంహెచ్‌ఒ
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని డిఎంహెచ్‌ఒ వెంకటరమణ ఆదేశించారు. మంగళవారం మండలంలోని నారాయణపురం పిహెచ్‌సిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన గూడెంలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవికాలంలో ఎండబెట్ట తగిలి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, వైద్య ఆరోగ్య సిబ్బంది అడవి బిడ్డలకు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మండలంలోని అడవి బిడ్డలందరికీ అత్యంత మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










