మాట్లాడుతున్న సోందె వీరయ్య
ప్రజాశక్తి - ఎటపాక
గిరిజనులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గోండ్వాన సంక్షేమ పరిషత్ నాయకులు సోందె వీరయ్య డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పురుషోత్తపట్నంలో గిరిజనులు చేపట్టిన పోరాట శిబిరాన్ని వీరయ్య బుధవారం సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ గిరిజనులకు అండగా ఉన్న చట్టాలు, హక్కులు అమలు అమలు పరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాక అర్జున్ దొర, మండల కార్యదర్శి ఇరపా అజరు, నాయకులు సొందె రామారావు, బుద్దుల భద్రయ్య, సోయం వీరమ్మ, కారం నగేష్, సీసం కొండ, భీష్మ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.










