గిరిజనులతో ఎస్‌ఐ రామకృష్ణ
ప్రజాశక్తి -సీలేరు
జికె.వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ, వలస గెడ్డలో 30 మంది గిరిజనులకు స్థానిక ఎస్సే రామకృష్ణ శనివారం దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామస్తులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం పలు విషయాలపై చర్చించారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సాగు అక్రమ రవాణా, సారా తయారీ వంటి కార్యకలాపాలు చేయొద్దని హితవుపలికారు.










