బియ్యం , బట్టలు పంపిణీ చేస్తున్న అనిల్‌కుమార్ తదితరులు
ప్రజాశక్తి-కూనవరం
ఫెయిత్ వే ఇండియా ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యాన గురువారం మండలంలోని కూటూరు గ్రామంలో 100 మంది గిరిజనులకు ప్రతి కుటుంబానికి ఒక బియ్యం బస్తా, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ అనిల్ కుమార్ అద్దేపల్లి (బాపట్ల) మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి మహిళలకు, పిల్లలకు బట్టలు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్థానికులు అనిల్ కుమార్ చేస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ మోజెస్, 10 మంది సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.










