Jul 14,2023 00:11

నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-కోటవురట్ల:అణుకు గ్రామానికి పాఠశాల, రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ చేపట్టిన గిరి పుత్రుల రిలే నిరాహార దీక్షలు గురువారం 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గిరి పుత్రులు గ్రామం నుండి డోలిమోస్తు.. ఇంకెన్నాళ్లీ డోలిమోత అని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు మాట్లాడుతూ, అణుకు గిరి పుత్రులకు రహదారి, పాఠశాల నిర్మించకపోవడం దారుణమని తెలిపారు. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో అత్యవసర పరిస్థితులలో వైద్యం చేయించు కునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, విద్యార్థులు చదువుకునేందుకు కాలినడకన రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చి పాఠశాల, రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఉగ్గిన రాము, సిపిఎం మండల నాయకులు డేవిడ్‌రాజు, ఎం.రాజబాబు, టి కొండబాబు, రమేషు, రఘు బాబు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.